Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని సారాజిపేట గ్రామంలో గురువారం కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు బూత్ స్థాయిలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు సభ్యత్వ రసీదులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బత్తుల నరేందర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కంతి నాగరాజు, ఉపాధ్యక్షుడు పెండ్యాల నాగరాజ్,, పార్టీ నాయకులు కాటంరాజు, శివ శంకర్ ,వేణు ,సురేష్, రవి, సురేష్ ,తిరుపతి రెడ్డి ,మధు, ఉపేందర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.