Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీడీపీి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యలు పరిష్కరించడంలోప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ అన్నారు.గురువారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. భూ ప్రక్షాళన పేరుతో ఎంతో ఆర్భాటంగా సభలు సమావేశాలు నిర్వహించిన కెసిఆర్ రైతుల సమస్యలు పరిష్కరించినది శూన్యం అని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించక పోగా కొత్త సమస్యలు సష్టించి రాష్ట్ర రైతాంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు. ధరణి రాకముందు కు రైతులకు ఉండే చిన్నచిన్న భూ సమస్యలు గ్రామ మండల స్థాయిలో పరిష్కారం అయ్యే వని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. ప్రతిదీ మీ సేవలో అప్లై చేసుకుని కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. లక్షలాదిమంది రైతులు పాస్‌బుక్కులు రాక చిన్న చిన్న సమస్యలతో ఇబ్బందులతో దరఖాస్తు చేసుకున్న నేటికీ పరిష్కారం కాలేదని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో చిన్న సన్నకారు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని మనోవేదనతో అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని వివరించారు .వెంటనే ధరణిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయిలో గ్రామ సభలు నిర్వహించి తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు ఏర్పుల సుదర్శన్. ఎస్సీ సెల్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ముత్యాల విజరు కుమార్. నాయకులు బద్దుల యాదగిరి. సామ రాంరెడ్డి. రేవనవెల్లి గోపాల్. ముత్యాల నరసింహ. పగిళ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.