Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు
మున్సిపల్ పరిధిలోని మూడోవార్డు ఏకశిల స్కూల్ రోడ్డు జంగాల కాలనీ వద్దలో నిల్వఉన్న ముగురునీటిని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఒమిక్రాన్, కరోనా విజంభిస్తోందన్నారు. డెంగ్యూ, మలేరియా, వ్యాధుల బారిన కాలనీవాసులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని రోగాలు అధికంగా ఉండడంతో మున్సిపల్ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని సూచించారు ఇక్కడ ఉండే కౌన్సిలర్ ప్రజలను గాలికి వదిలేసి పాలన చేస్తున్నారు ఇంత జరిగినా బంగారు తెలంగాణ ఇదేనా అని ప్రజాసంఘాలు అంటున్నాయి వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి పనులు పూర్తిచేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.