Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
స్థానిక రైతు ప్రజా సమస్యలపై కార్యాలయానికి వచ్చి తహసీిల్దార్కి విన్నవించడానికి వచ్చిన ప్రజా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించి, అవమానపరిచిన తుర్కపల్లి తహసీల్దార్ రవి కుమార్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుతూ గురువారం కలెక్టర్ పమేలా సత్పతికి తుర్కపల్లి మండల ప్రజాప్రతినిధులు 20 మంది ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తుర్కపల్లి ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు, సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి సర్పంచ్ పోగుల ఆంజనేయులు మాట్లాడుతూ స్థానిక ప్రజా సమస్యలపై ముఖ్యంగా రైతు సమస్యలపై వివరించడానికి, చర్చించడానికి తహసీిల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజా ప్రతినిధులను, ఎంపీటీసీ ,సర్పంచ్‌లను ముఖ్యంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ ధనావత్ బీకూ నాయక్‌ను బయటికి వెళ్లవలసిందిగా ఆదేశించడం, అసభ్య పదజాలంతో దూషించడం, అవమానపరచడం, సిగ్గుచేటన్నారు. తహసీిల్దార్ రవికుమార్‌ను విధుల నుండి తొలగించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మండల సర్పంచ్ లు నామసాని సత్యనారాయణ,శారద శంకర్, మంగ్తా నాయక్, జ్యోతి భాస్కర్, బాలకష్ణ యాదవ్,రమేష్ నాయక్,సురేష్, ఎంపీటీసీి ల ఫోరం అధ్యక్షులు పాచ్యానాయక్, ఎల్ ఎచ్ పి ఎస్ నాయకులు సంతోష్ నాయక్ పాల్గొన్నారు.