Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చింతపల్లి
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను ప్రతి బహుజన కులస్తులు సాధించాలని గౌడ సంఘం మండల అధ్యక్షులు అనంతుల వెంకటేష్‌గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు అన్నారు. కుర్మేడ్ ఎక్స్ రోడ్ వద్ద తెలంగాణ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఏకం చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కుర్మెడు సర్పంచ్ రాటకొండ రుద్రమదేవి నరేంద్రప్రసాద్, ఎంపీటీసీ శ్వేతా శ్రీశైలం గౌడ్, గౌడ సంఘం జిల్లా నాయకులు అనంతుల పెద్ద జంగయ్య గౌడ్, అనంతుల రామకృష్ణగౌడ్, పందుల యాదగౌడ్, సర్పంచ్ సత్తయ్య గౌడ్, అనంతుల పెద్ద మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఎం