Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలి
అ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -రామన్నపేట
కార్యకర్తలకు టీిఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఎట్టి పరిస్థితులలో మనో ధైర్యాన్ని కోల్పోకూడదని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. మండల కేంద్రంలో రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును మండలంలోని మునిపంపుల గ్రామానికి చెందిన గంగాపురం ఎల్లయ్య భార్య ముత్తమ్మ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. పార్టీ సభ్యత్వం పొందిన గంగాపురం ఎల్లయ్య గతేడాది ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మతి చెందారని మంజూరైన బీమా చెక్కును అందజేశామని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు మందడి ఉదయ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, నాయకులు పున్న జగన్మోహన్, నీల దయాకర్, మునిపంపుల ఎంపీటీసీ గాదే పారిజాత ముకుందం, పోచ బోయిన మల్లేశం, కంభంపాటి శ్రీనివాస్, బందెల రాములు, మామిళ్ల అశోక్, ఉడతల శీను, పున్న వెంకటేశం, బద్దుల రమేష్, జాడ సంతోష్, సల్ల సత్య ప్రకాష్, ఆముద లక్ష్మణ్, తదితరులు ఉన్నారు.