Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. గురువారం మండలంలోని కొండభీమనపల్లి గ్రామపంచాయతీలో జాతీయ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. అనంతరం నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ఎంపీ చేత గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మట్టిపెళ్లి వెంకటయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బుజ్జి బారు, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, హరిలాల్, వస్త్రం, ధర్మనాయక్, అమర్ సింగ్, మునుకుంట్ల జంగారెడ్డి, హిరమాన్, వెంకటాచారి, సత్తయ్య, వెంకటయ్య, ఎన్రోలర్లు వెంకటయ్య, కృష్ణ, ఎర్ర నగేష్, ఎల్లయ్య పాల్గొన్నారు.
గొట్టిముక్కలలో..
మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, సర్పంచ్ కడారి అయ్యన్నయాదవ్, జటావత్తండా సర్పంచ్ సుశీల లక్ష్మణ్, కొర్రతండా సర్పంచ్ నర్యానాయక్, ఉపసర్పంచ్ లింగయ్య, కడారి రామస్వామి, మాచర్ల వెంకటయ్య, లోక్యానాయక్, దేప కృష్ణారెడ్డి, వెంకటేష్, గిరి, సుధాకర్, దేవా,రమేష్, సాయికుమార్, ముకురోజు రాజు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.