Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చింతపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ధేన్యతండా గ్రామం (తీదేడు) వెంకటంపేట స్టేజీ వద్ద ఎల్ఎన్టీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి ఆయన గురువారం బహుమతులు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలలో ప్రతి ఒక్కరూ రాణించాలని అన్నారు. అనంతరం మొదటి బహుమతి రూ.22 వేల 222ను ఎంపీటీసీ బూర్గు ధనమ్మ పెద్ద మల్లయ్య, రెండో బహుమతి రూ.11 వేల 111లను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ.2500లను వర్కాల సర్పంచ్ వింజమురి రవి అందించారు. కార్యక్రమంలో బూర్గు రాంబాబు, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు గున్రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, చింతపల్లి మండల ఎస్టీసెల్ అధ్యక్షులు రమావత్ కొండల్ నాయక్, టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి వింజమూరి రవి, నాయకులు సిమర్ల శ్రీను యాదవ్, అంబోతు రవి, గ్రామ శాఖ అధ్యక్షుడు రమావత్ బగ్గునాయక్, ధర్మనాయక్, గ్రామ పెద్దలు రమావత్ తుల్చనాయక్, రామవత్ గోపినాయక్ ఆర్గనైజర్లు అంబోతు శంకర్, రమావత్ లక్ష్మణ్, రమావత్ సాయిరాం, రమావత్ స్వామి పాల్గొన్నారు.