Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వేగంగా వ్యాపిస్తున్న కోవిడ్ వైరస్
అ మండలంలో ఒక్కరోజులోనే 59 కేసులు నమోదు
అ పాజిటివి రేట్ 41.5 శాతంగా నమోదు
అ నిబంధనలు పాటించకుంటే ఉధతి పెరిగే అవకాశం
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
కరోనా వైరస్ మండలంలో కలవరం సష్టిస్తున్నది.పలు గ్రామాల్లో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో గ్రామాల్లో ఉండే ఆర్ఎంపి ల వద్ద చికిత్స పొందుతున్నారు. మొదటి, రెండో వేవ్ కంటే వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది.నిన్న,మొన్నటి వరకు పెద్దగా నమోదు కానీ పాజిటివ్ కేసులు గురువారం ఒక్కరోజులోనే 142 మందికి టెస్టులు చేయగా 59 మందికి పాజిటివ్ వచ్చింది. మండలంలో పాజిటివి రేట్ 41.5 గా నమోదైంది. మండల అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు.చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై తో పాటు నలుగురు కానిస్టేబుళ్లకు పాజిటివ్ వచ్చింది.మండలంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
-నిబంధనలు పాటించకుంటే కరోనా ఉధతి పెరిగే అవకాశం ఎక్కువ
మండలంలోని పలు గ్రామాల ప్రజలు వివిధ రకాల పనుల కోసం మండల కేంద్రానికి రావడం వస్తుంటారు. రాకపోకలు సాగించే సమయంలో మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. చారు కొట్టు, వ్యాపార సముదాయాల వద్ద గుంపులుగా జన సమాచారం ఉంటుంది.పోలీసులు మాస్కులేని వారికి ఫైన్ వేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తు, జరమానాలు విధిస్తున్నా కూడా జనాల తీరు మారడం లేదు.ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కరోనా వైరస్ వ్యాప్తి ఉదతంగా పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రజలు తప్పని సరిగా నిబంధనలు పాటిస్తూ,మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని మండల వైద్యాధికారి శివప్రసాద్ రెడ్డి సూచించారు.