Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి జగదీశ్‌రెడ్డి
అ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేత
నవతెలంగాణ-సూర్యాపేట
పేదల సంక్షేమాభివద్ధియే టీఆర్ఎస్ ప్రభుత్వం అతిపెద్ద ఎజెండా అని స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో కల్యాణలక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను స్వయంగా లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి అందచేయడంతో స్థానిక మహిళలు సంతోషం వెలిబుచ్చారు. పురపాలక సంఘం పరిధిలోని 13 వార్డులలోనీ 86 మంది లబ్దిదారులకు కళ్యాణాలక్ష్మి,షాది ముబారక్ పధకం కింద మొత్తం రూ.86 లక్షలా 1,376 విలువగల చెక్కులను మంత్రి అందజేశారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏనాడు పేదల పక్షాన పనిచేయలేదని విమర్శించారు. వారి సంక్షేమం కోసం ఎన్ని కోట్లయినా ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అందులో భాగంగానే పేదింట్లో జరిగే యువతుల పెళ్లిళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కట్నాన్ని ప్రకటించారని వెల్లడించారు. లబ్దిదారులకు నేరుగా అందించాలని సీఎం సంకల్పించినట్లు చెప్పారు. పట్టణ పరిధిలోని 7, 8,9 21, 22, 23, 24, 25, 26, 27, 38, 39,40 వార్డులలో చెక్కులను అందజేసినట్టు తెలిపారు.
విద్యుత్ సంస్థల అభివద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలి : మంత్రి
విద్యుత్ సంస్థల అభివద్ధిలో కాంట్రాక్టర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రూపొందించిన 2022 క్యాలెండర్,డైరీలను ఆయన గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విద్యుత్ రంగంలో ఏర్పడ్డ సంక్షోభమే ములమైందని గుర్తు చేశారు. ఆ విషయాన్ని మొట్టమొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన చెప్పారు.అటువంటి రంగాన్ని కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ముందుకు తీసుకు పోయింది సీఎం కేసీఆర్ మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మాజిద్,నాయకులు పర్వతాలు, దోసకాయల శ్రీనివాస్, వేణుగోపాల్, యాదయ్య, సత్తిరెడ్డి, వహిద్ తదితరులు పాల్గొన్నారు.