Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపు
నవతెలంగాణ- సూర్యాపేట
ఈనెల 22 నుండి 25 వరకు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడవ మహాసభల సందర్భంగా కరోనా వైరస్ కారణంగా ఆన్లైన్లో బహిరంగ సభనుజయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఆన్లైన్ ద్వారా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మూడవ దఫా తీవ్రంగా ఉన్నందున ఈ నెల 22న సాయంత్రం నాలుగు గంటలకు ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పార్టీ శ్రేణులు , మేధావులు, ప్రజలు సీపీఐ(ఎం)సూర్యాపేట అనే ఫేస్ బుక్ పేజీ ద్వారా వీక్షించాలని కోరారు. దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏడేండ్ల్ల కాలంలో దేశాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. ఎన్నడూ లేని విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశంలో అశాంతిని నెలకొల్పిందని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం మోపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువులతో సామాన్యుడి నడ్డి విడిచారని ఆరోపించారు. దేశ సంపదను బడాబాబులకు, కార్పొరేట్ శక్తులకు అప్ప చెపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల ఆస్తిని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూమి, అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం ఊసే లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న తిరోగమన విధానాలపై పోరాడుతూనే రాష్ట్ర సమగ్రాభివద్ధి కోసం సీపీఐ(ఎం) నిరంతరం అనేక ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. నిరంతర ప్రజలను సంఘటిత పరుస్తూ, లౌకిక, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం నికరంగా నిలబడి పాలకుల కుట్రలను ఎప్పటికప్పుడు బట్టబయలు చేస్తుందన్నారు. ఆన్లైన్లో జరిగే ఈ బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బందా కారత్ ,బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారని చెప్పారు.ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు,బుర్రి శ్రీరాములు,మట్టిపల్లి సైదులు,కోట గోపి, జిల్లాపల్లి నరసింహారావు, మేకనబోయిన శేఖర్, చెరుకు యాకలక్ష్మి , పులుసు సత్యం,చిన్నపంగ నరసయ్య,దేవరం వెంకట్ రెడ్డి,ధనియాల శ్రీకాంత్ , పారేపల్లి శేఖర్ రావు, బెల్లంకొండ వెంకటేశ్వర్లు , కొదమగుండ్ల నగేష్ , పాండు నాయక్, మేదరమెట్ల వెంకటేశ్వరావు,మిట్ట మడుగుల ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.