Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి
నవతెలంగాణ- సూర్యాపేట
పంది మాంసం తింటే పంది ఆలోచనలు,మేక మాంసం తింటే మేక ఆలోచనలు, కోడి మాంసం తింటే కోడి లాగా పెంటకుప్పల్లో ఏరుకు తింటారని మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేసిన చినజీయర్ స్వామిని వెంటనే అరెస్ట్టు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కోట గోపి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చినజీయర్ స్వామికి ప్రజస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా ఏ మాత్రం గౌరవం లేదన్నారు. మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. చినజీయర్ స్వామి బలహీన వర్గాలకు, మాంసాహారం తినే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం,కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు దేవరకొండ యాదగిరి,జిల్లా నాయకులు పాల్వాయి శంకర్, పిండిగ జానయ్య, రాములు,వెంకన్న, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.