Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని అనంతారం గ్రామం నుండి తాజ్పూర్ గ్రామం వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులను గురువారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రోడ్డును పరిశీలించి, నాణ్యతా ప్రమాణాల విషయంను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు చిందం మల్లికార్జున్, బొమ్మ రేపు సురేష్, ఎంపీటీసీ సామల వెంకటేష్, ఉప సర్పంచ్ రేఖల సంతోష్ శ్రీనివాస్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.