Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్కట్పల్లి
మండలపరిధిలోని షాపల్లిలో గల శ్రీ కమాలాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి , నార్కట్ పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, ఎల్లారెడ్డిగూడెం ఉప సర్పంచ్ వడ్డే భూపాల్ రెడ్డి, జక్కలి పరమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యనాల రాంరెడ్డి, పల్లె నరేందర్రెడ్డి , యూత్ కాంగ్రెస్ నాయకులు శీలిగిరెడ్డి వెంకట్ రెడ్డి, పిల్లిజాని, మాగి నాగరాజు, ఊడుతల వెంకన్న పాల్గొన్నారు.