Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
అక్రమంగా తరలిస్తున్న 07 క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని పోలీసులు పట్టుకున్న సంఘటన శుక్రవారం పట్టణంలో చోటు చేసుకుంది.ఎస్సై నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..నేరేడుచర్ల వద్ద వాహనాల తనిఖీలో భాగంగా ఏపీ24వీ 9550 వాహనాన్ని తనిఖీ చేయగా 7 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది.ఫత్తేపురం నుండి మిర్యాలగూడకు అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు.పెన్‌పహాడ్ మండలం సింగారెడ్డిపాలెంకు చెందిన తాడోజు జనార్దనాచారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.