Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్‌పహాడ్
మండలపరిధిలోని లింగాల గ్రామ సర్పంచ్ మామిడివెంకన్న ప్రమాణస్వీకారం చేసి శుక్రవారానికి మూడేండ్లు పూరైన సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు ఆయన్ను ఘనంగా సన్మాని ంచారు.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకన్న మాట్లాడుతూ మొదటి, రెండవ, మూడవ సంవత్సరాలలో గ్రామాభివద్ధికి పూర్తి సహకారం అందించిన ఉపసర్పంచ్‌కు, వార్డు సభ్యులకు, గ్రామపెద్దలకు, గ్రామ ప్రజలకు, యువతకు ధన్యవాదాలు తెలిపారు.గ్రామాభివృద్ధి మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీపీ నెమ్మాదిభిక్షం, వైస్‌ఎంపీపీ సింగారెడ్డి ఆశీస్సులతోనే జరిగిందన్నారు.మున్ముందు కూడా వారు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కనకమ్మ సైదులు, వార్డు సభ్యుడు మామిడి కష్ణయ్య టీఆర్ఎస్ గ్రామ నాయకులు ఏసురాజు దుర్గయ్య, పెద్దగౌడ్, మామిడి సర్వయ్య, యూత్ అధ్యక్షుడు మామిడి నవీన్, మామిడిసైదులు, సందీప్, జగన్, సాయి, గుండుసతీష్, అనిల్, జానయ్య పాల్గొన్నారు.