Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే
అ టీఆర్ఎస్,బీజేపీ దొందూ దొందే...
అ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
వచ్చే ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం నుండి 50 వేల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారం పట్టణంలోని డేగ బాబు ఫంక్షన్హాల్లో నియోజకవర్గ స్థాయి పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డితో కలిసి మాట్లాడారు.కోదాడ నియోజకవర్గంలో 60 వేల సభ్యత్వాలకు 38వేల సభ్యత్వాలు పూర్తి చేశామన్నారు.అన్ని జిల్లాలలో కన్నా సూర్యాపేట జిల్లాను అధికంగా సభ్యత్వాలు చేయించి ముందుంచాలన్నారు. ప్రతి బూత్ లలో 300 సభ్యత్వాలు చేయాలని పిలుపు నిచ్చారు.అనంతరం సభ్యత్వాలు చేసిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈనెల 26వ తేదీన మరలా సమావేశం నిర్వహించి అందర్ని సన్మానిస్తా మన్నారు.డిజిటల్‌గా నమోదు చేసేటప్పుడు సర్వర్, సిగల్ సమస్యలు ఉంటే తన దష్టికి తీసుకురావాలన్నారు.కాంగ్రెస్ సభ్యత్వంం తీసుకున్న ప్రతి ఒక్కరు గర్వపడాలన్నారు.గడిచిన 2014,2015లో వచ్చిన పార్టీలు త్వరలోనే భూగర్భజలాలలో కలిసిపోతాయన్నారు.తమ పార్టీ హయాంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజె క్ట్‌లను, రోడ్లు ,విద్యుత్ వంటి అనేక సౌకర్యాలు కల్పించిందని గుర్తుచేశారు. తెలంగాణలో బీజేపీకి ఎదుగుదల లేదన్నారు. టీఆర్ఎస్,బీజేపీ దొందూ దొందేనన్నారు.ఆయా పార్టీల తీరు ఢిల్లీలో మేదోస్తీ..గల్లీలో మే కుస్తి అని వ్యాఖ్యా నించారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 స్థానాలను తమ పార్టే కైవసం చేసుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. కోదాడలో పోలీస్‌శాఖకు, టీఆర్ఎస్కు పొత్తుకుది రిందన్నారు.త్వరలోనే మిత్తీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చెవిటి వెంకన్న, నల్లగొండ జిల్లా అధ్యక్షులు శంకర్‌నాయక్, నియోజకవర్గ ఇన్చార్జి ప్రేమ్‌లాల్, నాయకులు వంగవీటి రామారావు, వరప్రసాద్‌రెడ్డి, సీతయ్య, పాలూరి సత్య నారాయణ, నాయకులు, సర్పంచులు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.