Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నూలు, రంగులు, రసాయనాల ధరలు పెరుగుదలతో చేనేత కార్మికుల జీవన పరిస్థితి దారుణంగా తయారైందని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ చేనేత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. త్వరలో అధికారులతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయమని కోరారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ కరోనా కారణంగా పనులు లేక చేసిన పనికి కూలి గిట్టుబాటు కాక నేసిన బట్టలు టెస్కో వారు కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చేనేత సహకార ఎన్నికలు నిర్వహించకపోవడంతో సహకార వ్యవస్థ నిర్వీర్యమై పోయిందని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందడం లేదని, గతంలో అంత్యోదయ, అన్నపూర్ణ పథకాల ద్వారా ఉచిత బియ్యం, ఆరోగ్య బీమా పథకాలు వర్తించేవని పేర్కొన్నారు. ఉపాధి కోసం నల్లగొండ పట్టణానికి వలస వచ్చి అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న చేనేత, పవర్లూమ్ కార్మికులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, స్థలం ఉన్న వారికి ఇల్లు, వర్క్ షెడ్ నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. పవర్లూమ్ కార్మికులకు జియో టాక్ వేసి పొదుపు పథకం అమలు చేయాలని కోరారు. చేనేత, పవర్లూమ్ అనుబంధ వృత్తుల కార్మికులకు జియో టాక్ వేసి పొదుపు పథకం అమలు చేయాలని కోరారు.