Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్‌కుమార్
నవతెలంగాణ-తుంగతుర్తి
దేశానికి పట్టుగొమ్మలైన పల్లెలను అన్ని రంగాలలోనూ అభివద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ గాదరికిశోర్‌కుమార్ అన్నారు.శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలుఅభివద్ధి కార్యక్ర మాలను ప్రారంభించడంతో పాటు శంకు స్థాపనలు చేశారు.మండలపరిధిలోని బాపని బావితండా, ఏనేకుంటతండాలో రూ.12.6 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వైకుంఠ దామాలను ప్రారంభించారు.గొట్టిపర్తి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన సీసీరోడ్లు, జెడ్పీహెచ్ఎస్లో రూ.26 లక్షల నిధులతో నిర్మించిన అదనపుతరగతి గదులు, రూ.11 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించారు.రావులపల్లి, రావులపల్లి ఎక్స్‌రోడ్ తండా గ్రామ పంచాయతీల్లో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీరోడ్ల పనులకు శంకుస్థాపన చేయడంతోపాటు గ్రామంలో రూ.12.6 లక్షలతో నిర్మించిన వైకుంఠ దామాన్ని ప్రారంభించారు.వెంపటి గ్రామంలో రూ.12.6 లక్షలతో నిర్మించిన వైకుంఠ దామాన్ని ప్రారంభించి, సీసీరోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి అంతేకాక మండలకేంద్రంలో ఎస్సీకాలనీలో రూ.23 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు, డ్రయినేజీ కాలువలను ప్రారంభి ంచారు.వెలుగుపల్లి, కాశీతండా గ్రామ పంచాయతీలలో నిర్మించిన వైకుంఠదామాలను ప్రారంభించారు.ఈ కార్యక్ర మంలో తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీ డీవో ఉపేందర్‌రెడ్డి, పంచా యతీరాజ్ డీఈ ప్రభాకర్, ఏఈ నవకాంత్,డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు యుగంధర్ రావు, ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మెన్ యాదగిరిగౌడ్, వైస్‌ఎంపీపీ శ్రీశైలంయాదవ్,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నల్లు రాంచంద్రారెడ్డి, మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు, ఆయా గ్రామాల సర్పంచులు చందా వెంకన్న,గుగులోత్వెంకన్న, అబ్బగాని పద్మ సత్యనారాయణగౌడ్,గుగులోత్ ఈరోజి ,మామిడి వెంకన్న, ఎంపీటీసీలు కేతిరెడ్డి లతా విజరు కుమార్‌రెడ్డి,మట్టిపల్లి కవితాకుమార్, తునికి సాయిలు,మోదాల పరమేష్,భాషబోయిన వెంకన్న పాల్గొన్నారు.