Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా సుభాష్ సేవలు అభినందనీయమని లారీ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు అన్నారు.శుక్రవారం జోనల్ బదిలీల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వెళ్తున్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుభాష్‌ను లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయవీడ్కోలు కార్యక్రమం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా నాగేశ్వర్రావు మాట్లాడుతూ కోదాడలో ఐదేండ్లుగా సుభాష్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించి జోనల్ బదిలీల్లో భాగంగా తన సొంత జిల్లాకు వెళ్తున్న సందర్భంగా సన్మానించామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర లారీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రామినేని శ్రీనివాసరావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవులరామారావు, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు కనగాల నాగేశ్వరరావు, కార్యదర్శి తూనం కష్ణ, టీిఆర్‌ఎస్ నాయకులు వనపర్తి లక్ష్మీనారాయణ, గౌస్, దొంగరిరవి, లింగయ్య, షబ్బీర్, ఆలేటి రాంబాబు, రంగా, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.