Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహకంగా చిట్యాల మండలానికి మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, మాజీ సహాయ కార్యదర్శి జిట్ట నగేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో శుక్రవారం డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే మండల స్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలకు సరైన బడ్జెట్ కేటాయింపులు లేకపో వడంతో క్రీడాకారులలో తగిన నైపుణ్యం కరు వైందని ఆవేదన వ్యక్తంచేశారు. వివిధ గ్రామ స్థాయిలతోపాటు మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహ కులను వారు అభినందించారు. ముందుగా క్రీడల జెండాను జిట్ట నగేష్ ఆవిష్కరించగా, కబడ్డీ పోటీలను మహేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు అవిశెట్టి శంకరయ్య, అరూరి శ్రీను, అరూరి నర్సింహ, పంది నరేష్, ఆమనగంటి గోపి ,నాతి వెంకట్రామయ్య, సత్తిరెడ్డి ,సాయి, చిన్న, రమేష్, కిరణ్, గణేష్, రాజు,వెంకట్ ,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.