Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల15 అర్ధరాత్రి నుండి కురిసిన అకాలవర్షానికి జిల్లాకేంద్రంలోని పలుకాలనీలు జల దిగ్బంధంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.దీనిపై పలువురు ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో పట్టణంలోని మానస నగర్‌కాలనీ నాలా ఆక్రమణకు గురైందని విమర్శలు గుప్పించారు.దీనిపై కాలనీవాసులు గతంలోనూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం కూడా అందజేశారు. విషయం సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొట్టిన విషయాన్ని అధికారులు మంత్రి దష్టికి తీసుకెళ్లారు.దీంతో శుక్రవారం పట్టణంలో సాగిన మంత్రి పర్యటనలో భాగంగా స్వయంగా నాలా ఆక్రమణ ప్రాంతాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు.నాలా నిర్మాణంపై అధికారులతో చర్చించి నాలాహద్దును ఏర్పాటు చేయాల్సిందిగా అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు.నాలాను ఆక్రమిం చుకొని కట్టిన ప్రహరీలను కూల్చివేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.ముంపు ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి నాలాఅక్రమాలను స్వయంగా పరిశీలించిన మంత్రితో పాటు డీసీఎంఎస్ చైర్మెన్ వట్టెజానయ్యయాదవ్కు కాలనీవాసులు ప్రత్యేకధన్యవాదాలు తెలిపారు. గతంలో కౌన్సిలర్ వట్టె రేణుక సొంత నిధులతో మట్టి గూనలు ఏర్పాటు చేసిందని మంత్రి దష్టికి తీసుకుపోగా,త్వరలోనే తానూ మరోసారి కాలనీ మొత్తం కలియతిరిగి అభివద్ధి పనులను ప్రారంభిస్తానని ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.