Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
సీపీఐ(ఎం) నాయకులు అలువాల జానకి రాములు మతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు.జానకిరాములు గుండె పోటుతో మరణించిన విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం జిల్లాకేంద్రంలోని శ్రీరాం నగర్లోని జానకిరాములు నివాసంలో ఆయాన భౌతికకాయానికి ఎర్రజెండా కప్పి జోహార్లర్పిం చారు.అనంతరం నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జానకిరాములు స్వగ్రామం మునగాల మండలం విజయరాఘవపురం గ్రామంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం చిన్నతనం నుండే కమ్యూనిస్టు భావ జాలంతో పుణికి పుచ్చుకొని ఎర్రజెండా నాయ కత్వంలో పోరాటాలు నిర్వహించా రన్నారు. గ్రామంలో వ్యవసాయ కూలీలకు కూలిరేట్ల పెంపుకోసం, భూస్వాములకు వ్యతి రేకంగా పనిచేశాడని కొనియాడారు.రేపాల పీఏసీఎస్ డైరెక్టర్ గా ఉండి గ్రామంలోని రైతాంగానికి ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీరుణాలు, ఎరువులు అందించడంలో కీలకపాత్ర పోషించారన్నారు.పార్టీ సభలు, సమావేశాలకు జనాన్ని సమీకరి ంచడంలో, గ్రామంలో సీనియర్ నాయకులతో కలిసి ఎర్రజెండాను నిలబెట్టడంలో ఆయన చేసిన కషి మరువలేనిదన్నారు.తన జీవితాంతం వరకు ఎర్రజెండాను వీడకుండా పోరాటం చేసిన జానకిరాములు ఆశయ సాధన కోసం అందరూ కషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోటగోపి గ్రామీణ ఉద్యోగుల సమైక్యనాయకులు నర్సయ్య,దయాకర్, ఆయన కుమారులు అలువాల మధు, బంధువులు సుధాకిషోర్, నందకిషోర్ పాల్గొన్నారు.