Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
కరోనా పేరుతో విద్యాసంస్థల మూసివేత సరికాదని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి షేక్ యాకుబ్ విమర్శించారు.శుక్రవారం మండలంలోని కీతవారిగూడెం గ్రామం లోని సుందరి భిక్షమయ్యభవన్లో బొల్లేపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాసాకుతో బార్‌షాప్, వైన్‌షాప్‌లు తెరిచి, రెస్టారెంట్లు, సినిమా హాళ్లుకు విచ్చలవిడిగా అనుమతి ఇస్తూ విద్యా సంస్థలను మూసివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.పేదల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వాలు నిత్యావసరధరలు రోజురోజుకు పెరుగు తున్నాయన్నారు.నాలుగేండ్లుగా పేదలకు పింఛన్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు.ఇంటికో ఉద్యోగమని కల్లబొల్లి కబుర్లు చెప్పి ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు.అంతేకాకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.ఈ కార్యక్రమంలో దోసపాటి భిక్షం, తుమ్మలసైదయ్య, మచ్చ వెంకటేశ్వర్లు, జట్టుకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.