Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ చీఫ్ కోర్టినేటర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-నల్లగొండ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బహుజన రాజ్యాధికారం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ చీప్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నల్లగొండలో ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన బీఎస్పీ కార్యకర్తల విస్తృత స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నడూలేని విధంగా నల్లగొండ జిల్లాలో బీఎస్పీ ముందుకు దూసుకుపోతోందని అన్నారు. నల్లగొండ ఎన్జీకాలేజీలో తాను కూడా గత ఏడాది ఆగస్టు 8వ తేదీన లక్షలాది మంది ప్రజల సమక్షంలో బీఎస్పీలో చేరారని, తెలంగాణ ప్రజలు తనను ఆదరించినట్లు గుర్తు చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు, రైతులకు, గిరిజనులు, రైతులు, మైనార్టీలకు కేసీఆర్ చేసిన అన్యాయాన్ని వారు గుర్తించారని పేర్కొన్నారు. బహుజన రాజ్యం ద్వారానే న్యాయం జరుగుతుందని ప్రజలు గుర్తించారని చెప్పారు. అందుకు అనుగునంగానే జనవరి 15న బీఎస్పీ అధినేత్రి మాయావతి జన్మదినం సందర్భంగా బహుజన రాజ్యాధికారయాత్రను రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవకర్గాల్లో 300 రోజుల పాటు పర్యటించి రాజ్యాధికారంపై వివరించాలని నిర్ణయించుకున్నారని వివరించారు. కొవిడ్ విజృంభిస్తుండటంతో భారత ప్రభుత్వం, ఆరోగ్య శాఖ సూచనలు గౌరవిస్తూ తమ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షాలకే ఓమిక్రాన్ నిబంధనలు వర్తిస్తాయా, అధికార పార్టీ రైతుబంధు యాత్రల పేరుతో కొవిడ్ నిబంధనలకు తిలోధకాలిస్తూ పట్టపగలే నడిరోడ్డున వేలదిమందిని తీసుకొచ్చి సంబరాలు జరుపుతున్నారని దుయ్యబట్టారు. క్షీరాభిషేకాలు, మీటింగ్‌ల పేరుతో కోవిడ్ వ్యాప్తికి అధికార టీఆర్ఎస్ పార్టీనే కారణమవుతుందని ఆరోపించారు. విద్యాసంస్థలకు రూ.7300 కోట్లు ఇస్తారని సీఎం చెబుతున్నారని, ఆ డబ్బును ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. 600 వందల గురుకులాలు ఏర్పాటు చేశారని, ఒక్క గురుకులానికి కూడా పైసా రాలేదని, బిల్డింగులు కట్టడానికి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ గురుకుల పాఠశాలలో కూడా నోట్ బుక్కులు సప్లై కాలేదని, చలికి పిల్లలు గజగజ వణుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఉన్న టీచర్లంతా వ్యాక్సినేషన్ వేయించుకున్నారని, వాళ్లతో పాఠశాలలు ఓపెన్ చేయించాలని సూచించారు. ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తే దాదాపుగా 51శాతం మంది విద్యార్థుల ఫెయిల్ అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో అసైన్డ్, పోడు భూముల్ని భడా పారిశ్రామిక వర్గాలకు కట్టబెడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించడానికి బహుజన రాజ్యాధికార యాత్ర చేయబోతున్నానమని చెప్పారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా నేత పూదరి సైదులు, అన్ని నియోజక వర్గాల నేతలు హాజరయ్యారు.