Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
తుర్కయంజాలలో జరుగనున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో మహాసభల బహిరంగ సభ గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు రంగారెడ్డి జిల్లా తుర్కయంజాలలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ జరుగుతాయని పేర్కొన్నారు. 22న సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్ బహిరంగ సభ జరుగుతుందని, దీనిని ప్రజలు వీక్షించి జయప్రదం చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను 23 నుంచి 25 వరకు జరగనున్న ప్రతినిధుల సభలో చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తారని పేర్కొన్నారు. ప్రతినిధుల సభలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు రవినాయక్, భవాండ్ల పాండు, తిరుపతి రామూర్తి, ఎండీ.అంజద్, శశిధర్ రెడ్డి, రాగిరెడ్డి మంగరెడ్డి, రేమడల పరశురాములు వరలక్ష్మి, సీపీఐఎం వన్ టౌన్ కార్యదర్శి మల్లు గౌతమరెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పథాని శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు బాబునాయక్, నాయకులు రామారావు, వెంకటరెడ్డి, కరిముంనిషా పాల్గొన్నారు.