Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలంలోని ఐలాపురం గ్రామపంచాయతీ పరిధిలో మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా తమ్మడి చెరువు దగ్గర కల్వర్టు కూలిపోయి రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉన్న కారణంగా ఆ ప్రాంతాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం పరిశీ లించారు.సర్పంచ్ బోడపట్ల సునీతశ్రీను నూతనకల్వర్టునిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరడంతో మంత్రి సాను కూలంగా స్పందించారు.త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కలెక్టర్వినరుకష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్‌రెడ్డి,జిల్లా నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, ప్రకాష్‌రెడ్డి, ఉపసర్పంచ్ వినోద్, క్రాంతికుమార్, కిషన్, వినోద్, ప్రవీణ్ పాల్గొన్నారు.