Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
రాష్ట్రంలో బీసీ బంధును ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కష్ణ, అశోక్ డిమాండ్ చేశారు .ఆదివారం ఆలేరు మండలంలోని సీపీఐ కార్యాలయంలో తెడ్డు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం దళిత బంధు ప్రవేశపెట్టి దళితులను ఆర్థికంగా ముందుకు తీసుకెళుతున్న విషయంలో స్వాగతిస్తున్నామని అదేవిధంగా ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు బీసీ బంధు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ ,,బీసీ నాయకులు పే రేపు రాములు, కనకయ్య ,యాదగిరి , అంజయ్య సంగీత తదితరులు పాల్గొన్నారు.