Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని చౌదర్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కూకుట్ల పరమేష్ అనారోగ్యంతో మతి చెందగా ఆదివారం దశదినకర్మకు పలువురు నాయకులు కుటుంబ సభ్యులు ఓదార్చి పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గత కొన్ని కాలంగా పార్టీ తరఫున కాకుండా ప్రజాసేవకులుగా గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేశాడని. పరమేష్ చేస్తున్నటువంటి ఒగ్గు కళను మరవలేక పోతున్నాం అని. ఒక మంచి కళాకారుడు కోల్పోయామని గ్రామస్తులు దుఃఖంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో కూకుట్ల ఈశ్వర్ యాదవ్, రమేశ్ యధువ్, ఏనగండ్ల వీరేశం, రామిడి బాలకష్ణ, నాయకుల యువకులు తదితరులు పాల్గొన్నారు.