Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో ఆదివారం నేతాజీ సుభాశ్ చంద్రబోస్ 125వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3వ వార్డు కౌన్సిలర్ బండమీది మల్లేశం సుభాశ్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కడారి అయిలయ్య, కళ్లెం రత్నారెడ్డి, పర్నె జంగారెడ్డి, సింహానారాయణ, కంచర్ల బుచ్చయ్య, ఎర్ర బుచ్చయ్య పాల్గొన్నారు.