Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
మైనార్టీ వర్గాల ప్రజల సంక్షేమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమ య్యాయని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ విమర్శించారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామ పంచాయతీ పరిధిలోని రాయపురం గ్రామంలో ఆదివారం చర్చి అభివృద్ధి కోసం రూ.30,000 విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దైద రవీందర్ మాట్లాడుతూ మైనారిటీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు బొప్పని స్వర్ణలత, జిల్లా కాంగ్రెస్ నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి, నకిరేకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి, బొప్పని సురేష్ ఇనుపాముల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బత్తుల సంజీవ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బత్తుల సత్యనారాయణరెడ్డి, దర్శిన లింగయ్య, బొజ్జ జానయ్య, పరమేష్, దేశింత, ఎండీ. యూసుఫ్, వంటేపాక సతీష్, పందిరి సతీష్ పాల్గొన్నారు.