Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో జరిగే ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభ సభకు వెళ్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో కేంద్ర; రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.