Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
నవ తెలంగాణ- సూర్యాపేట
కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ నిజమైన అభివద్ధి పాలన జరగాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమౌతుందని టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో దురాజ్ పల్లి ఆవాసం వస్రం తండాకు చెందిన తారాసింగ్ తో పాటు 50 మంది టీిఆర్ఎస్ కార్యకర్తలకు రమేష్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్రంలో అవినీతి ఏరులై పారుతుందని, సీఎం కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ప్రజాధనం రాబందుల్లాగా దోచుకుంటున్నారని విమర్శించారు. ఆత్మకూరు (ఎస్) మండలం ముక్కుడు దేవులపల్లి పీఏఎస్లో రెండు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని,ఇందులో టీిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండానే చేసినట్లు దొంగ బిల్లులు పెట్టి ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. మంత్రి,కలెక్టర్ లే నిందితులను కాపాడుతున్నారని అన్నారు.కేవలం ఒకరిద్దరు, కంప్యూటర్ ఆపరేటర్ లపై చర్యలు తీసుకొని చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. ధాన్యం కుంభకోణంలో అసలైన నిందితులను పట్టుకుని వారిపై పిడి యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు పని చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అన్నారు.అందుకు సభ్యత్వాల నమోదు కొరకు పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ షఫీఉల్లా, మాజీ కౌన్సిలర్ వల్దాస్ దేవేందర్, ఫారూక్, తారాసింగ్, వస్రం సింగ్, జాని, ప్రకాష్, రవి, దీప్లా, చారు, శివప్రసాద్, మోతిరాం పాల్గొన్నారు.