Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-దేవరకొండ
దేవరకొండ మండలం జిల్ల్లేపల్లి గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి మృతి బాధాకరమని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం వెంకట్ రెడ్డి దశదినకర్మలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటన్నారు. ఆయన వెంట ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మెన్ పల్లా ప్రవీణ్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు టీవీఎన్ రెడ్డి, నేనావత్ శ్రీను, నూతనగంటి రఘు, శ్రీనివాస్‌రెడ్డి, అనితరెడ్డి పాల్గొన్నారు.