Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఒమిక్రాన్ పట్ల భయాందోళనలు వద్దు
అ ఇంటి వద్దకే అందరికీ వైద్య సేవలు
అ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
నవతెలంగాణ -మిర్యాలగూడ
కరోనా కట్టడి కోసమే ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్నట్టు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆదివారం ఫీవర్ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 36వ వార్డు షాబూనగర్లో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ తిరునగర్ భార్గవ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి వారు పర్యటించారు. ఫీవర్ సర్వే బందాల పనితీరును స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫీవర్ సర్వే కోసం వైద్య, ఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. థర్డ్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోంమ్ ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేసిందన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఫీవర్ సర్వే నిర్వహిస్తోందన్నారు. కరోనా రెండో వేవ్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జ్వర సర్వే అద్భుత ఫలితాలను ఇచ్చిందన్నారు. గతేడాది మే 6న నిర్వహించిన జ్వర సర్వే కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. సర్వేకు ముందుగా కేసుల సంఖ్య 6,361 ఉండగా సర్వే చేపట్టిన అనంతరం 3,660 కేసులు తగ్గాయని తెలిపారు. ఎకనామిక్ సర్వే 2020-21 కోవిడ్‌ను సమర్ధంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో తెలంగాణను చేర్చి ప్రశంసించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, ముందుచూపు ఫలితంగా కేసుల సంఖ్య 50 శాతం తగ్గాయని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలున్న వారికి హోమ్ ఐసోలేషన్ కిట్లు అందజేస్తారని అన్నారు. అర్హులందరికీ క్షేత్ర స్థాయిలోనే వాక్సినేషన్ అందించే ప్రక్రియ చురుకుగా కొనసాగుతోందన్నారు. జ్వర సర్వే కు ప్రజలు సహకరించాలని వారు కోరారు. ఐసోలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టీమ్ లు ప్రతిరోజు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాలని ఆదేశించారు.