Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు కార్పోరేట్ స్థాయికి మించిన విద్యను అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు.తెలంగాణ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మంత్రి,సంఘ సభ్యులతో కలిసి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన తప్పక అమలు చేస్తామని స్పష్టం చేశారు.ఈ సంధర్భంగా జీవో నంబర్ 317 లో జరిగిన కేటాయించిన భార్యభర్తల విషయంలో స్థానిక కేటాయింపులోని లోపాలను టిటియు జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమశేఖర్ మంత్రి దష్టికి తీసుకెళ్లి,లోపాలను సవరించి ఉపాధ్యాయుల కేటాయింపులో న్యాయం చేయాలని కోరారు.అందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టిటియు జిల్లా అధ్యక్షులు కందుకూరి సోమశేఖర్,ప్రధాన కార్యదర్శి గంగాడి వెంకట నర్సింహారెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు పి.మల్లయ్య,ఉపాధ్యక్షులు షాకత్ అలీ,ఆచారి. పి కష్టయ్య,సైదా,రాజా,ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.