Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తిరుమలగిరి
మండలంలోని వ్యవసాయ మార్కెట్ ఎదురుగా నూతనంగా ఏర్పడిన రాధాకష్ణ సూపర్ మార్కెట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆదివారం లక్కీ డ్రా దీశారు. ఈ సందర్భంగా సూపర్ మార్కెట్ ప్రొప్రైటర్ గంజి చంద్రశేఖర్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్ లో సంక్రాంతి పండుగ సందర్భంగా బంపర్ లక్కీ డ్రా స్కీంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీనిలో భాగంగా ప్రతి వెయ్యి రూపాయల కిరాణా సరుకులు కొనుగోలు చేసిన వారికి ఒక కూపన్ ఇవ్వడం ఇచ్చామన్నారు. డ్రా లో గెలుచుకున్న వారికి మొదటి బహుమతి గా బీరువా, ద్వితీయ బహుమతిగా మిక్సీ ,తతీయ బహుమతిగా రైస్ కుక్కర్ , పదిమందికి కన్సొలేషన్ బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేశామన్నారు. దాదాపు నెల రోజులుగా కొనుగోలు చేసిన కస్టమర్లకు నాయకుల సమక్షంలో డ్రా తీయడం తీసినట్టు తెలిపారు. మొదటి డ్రా విజేతగా పత్తేపురం సుమలత, ద్వితీయ డ్రా విజేత గా భూక్య సరిత, తతీయ డ్రా విజేతగా సట్టు వీర సోములు, పది మందికి కన్సోలేషన్ బహుమతులు నాయకుల చేతులమీదుగా పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల శ్రీను, పీఏసీఎస్ చైర్మెన్ పాలెపు చంద్రశేఖర్ ,పాలెపు లక్ష్మయ్య, పాలెపు వెంకటేశ్వర్లు, పసుమర్తి సత్యనారాయణ, గబ్బెట సత్యనారాయణ, కొంపెల్లి యాదగిరి దేశగాని సోమయ్య పాల్గొన్నారు.