Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకురాలు కవితాదేవి తెలిపారు. ఆదివారం నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కేంద్రంలోని పాలకుర్ల శివయ్యగౌడ్ స్మారక ఫౌండేషన్ ఛైర్మన్ పాలకుర్ల మురళి ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, ఆంగ్ల భాష పరిజ్ఞానం అంశాలపై పోటీలు నిర్వహించారు. పోటీల్లోని విజేతలకు ఆమె బహుమతులు ప్రదానంచేశారు. రూ.15వేల నగదుతోపాటు స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్ర, ఆంగ్ల సాహిత్య పుస్తకాలు, డిక్షనరీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కన్వీనర్ భాను, సోని, ఉమ, శివణ్య పాల్గొన్నారు.