Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వసూల్ రాజాగా దఫెదర్
అ చర్యలు తీసుకున్న మారని అధికారి తీరు
అ స్టేషన్ కు వెళ్లాలంటేనే జంకుతున్న జనం
ఆ పోలీస్ స్టేషన్లో దర్శనం ఉంటేనే ఏపని అయినా సాఫీగా జరిగి పోతుంది. ప్రతిపనికీి ఓ రేటు చొప్పున వసూలు చేస్తూంటారు. భార్యాభర్తల పంచాయతీ నుంచి మొదలుకొని అసాంఘిక దందాల వరకు అందినకాడికి వసూలు చేయడమే వీరి పని... దీనికోసం ఆ స్టేషన్ ఉన్నతాధికారి ఒక దఫెదర్ను నియమించుకున్నారు. గతంలో ఆ అధికారిపై చర్యలు తీసుకున్నా తీరు మాత్రం మారలేదు. ఇప్పుడు పని చేసే స్టేషన్లో వసూల్ చేయడమే పనిగా పెట్టుకొని అందిన కాడికి దండుకుంటున్నారు. న్యాయం కోసం వెళ్లిన పైసలు ఇవ్వనిదే పని కాదు. పైగా అన్యాయం చేసిన వారి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. అందుకే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకే మండల ప్రజలు జంకుతున్నారు... ఈ విషయం ఉన్నత అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వెనక అనుమానాలు కలిగిస్తున్నాయి.
నవతెలంగాణ-మిర్యాలగూడ
నల్గొండ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో నార్కట్‌పల్లి అద్దంకి రహదారిపై ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో అవినీతి అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మిర్యాలగూడ సబ్ డివిజన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్ అవినీతికి కేరాఫ్‌గా మారింది. మండల పునర్విభజనలో భాగంగా ఆ మండలంలో ఉన్న ఎక్కువ గ్రామాలు విడిపోయి కొన్ని గ్రామాలకే పరిమితమై మండలంగా కొనసాగుతోంది. ఆయకట్టులోని ఈ మండలం ప్రధాన భూమికగా ఉండటంవల్ల ఈ మండలం నుండి ఎక్కువ మొత్తంలో ఇసుక రవాణా కొనసాగుతోంది. ఈ మండలంలో మూడు ఇసుక రీచ్‌లు ఉన్నాయి. ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతునది. దీనికితోడు ఈ మండలంలో భూ వివాదాలు కూడా ఎక్కువ గానే ఉన్నాయి. మండలంలో 8 పెట్రోల్ బంకులు కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ప్రధాన రహదారి పైన ఉన్న పోలీస్ స్టేషన్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇవే కాకుండా భార్యా భర్తల పంచాయితీలు, చిన్న చిన్న గొడవలు, గ్రామాల్లో చోటుచేసుకునే వివాదాలలో ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తుంటారు.
చర్యలు తీసుకున్నా మారని అధికారి తీరు...
ఈ స్టేషన్లో పనిచేసే ఎస్ఐ పనితీరు నేటికీ మారలేదు గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లు మేకల దొంగతనం కేసులో అతన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆ అధికారి చేతివాటం ప్రదర్శిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఇసుక దందా, పెట్రోల్ బంకులు, గుట్కా, పీడీఎస్ బియ్యం వ్యాపారం చేసే వారినుండి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. దీనికోసం స్టేషన్లో విధులు నిర్వర్తించే ఒక కానిస్టేబుల్‌ను దఫెదర్గా నియమించుకొని వసూలు చేస్తున్నట్టు సమాచారం. సదరు అధికారి అవినీతిపై మండల ప్రజలు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పోలీసు ఉన్నత అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. సదరు అధికారి ఈ పోలీస్ స్టేషన్ కి బదిలీపై వచ్చిన సరిగ్గా సంవత్సరకాలం అయినప్పటికీ డీఓ రాయించు కోకుండా ఇటీవల జరిగిన బదిలీలో తన బదిలీ కాకుండా ఓ ఉన్నత ప్రజాప్రతినిధి ద్వారా ఒత్తిడి చేయించాడు. బదిలీ కాకుండా జాగ్రత్త పడి సఫలీకతం అయినట్టు తెలిసింది.
ఆ స్టేషన్లో దఫెదరే కీలకం..
ఆ పోలీస్ స్టేషన్లో డబ్బులు వసూలు చేసేందుకు ఓ కానిస్టేబుల్‌ను దఫెదర్గా నియమించుకున్నారు. 'దర్శనం' అనే పదం ఆ దఫెదర్ పేరులోనే ఉన్నది . అందుకే దర్శనం ఆ స్టేషన్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆ దఫెదరి ..ఆ అధికారి ఒకే సామాజిక వర్గానికి చెందడంతో డబ్బులు వసూలు చేసే అధికారం అతనికి ఇచ్చారు. దీనితో సదరు దఫెదర్ నంబర్ ప్లేట్ లేని తన ద్విచక్ర వాహనంపై పగలు రాత్రి వేళలో కారులో 24/7 తిరుగుతూ రహస్యంగా వాడే చిన్న ఫోన్‌తో అక్రమ దందా లావాదేవీలు నడుపుతునట్లు సమాచారం. అక్రమ దందా చేసే వారికి అండగా ఉంటూ వారి నుంచి నెలవారీ మాములు వసూలు చేసి సదరు స్టేషన్ ఉన్నత అధికారికి ఇస్తుంటారు. భూ వివాదాల్లో సెటిల్మెంట్ చేసేందుకు ఇరు వర్గాల నుండి బేరం కుదుర్చుకుని వసూలు చేస్తూ ఉంటారు. న్యాయం కోసం వచ్చిన వారి నుండి కూడా అంతా తానే చూసుకుంటానని ఎస్సై తన బంధువు అని తాను చెప్పినట్టుగా ఎస్సై వింటాడని నమ్మబలికి పిటిషన్ దారుల నుండి డబ్బులు వసూలు చేస్తుంటాడని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు .ఇలా అన్ని కేసుల్లోనూ తలదూర్చి డబ్బులు వసూలు చేయడమే పనిగా ఆ దఫెదరి వ్యవహార శైలి కొనసాగుతోంది.
ఆ స్టేషన్లో జరిగే అవినీతి మచ్చకు కొన్ని....
మండలంలో 3 ఇసుక రిచులు ఉన్నాయి. వీటి పరిధిలో లెక్కకు 32 ట్రాక్టర్లు నడుస్తున్నాయి. ఒక్కక్క ట్రాక్టర్ నుంచి నెలకు రూ.10 వేలు చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నారు. లెక్కల్లో లేనివి మరి కొన్ని ఉన్నాయి. అంటే లెక్కల్లో ఉన్న వాటిని లెక్కిస్తే..నెలకు 3.20 లక్షలు మామూళ్లు వసూలు చేస్తూన్నారు.
-మండలంలో 8 పెట్రోల్ బంకులు ఉంటే ఒక పెట్రోల్ బంక్ నుండి నెలకు 30 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ వసూలు చేస్తున్నారు. నెలకు రెండు లక్షల 40 వేల లీటర్లు చమురును వసూలు చేస్తున్నారు.
- ఇటీవల ఒక ఇసుక లారీ నుండి అనుమతులు లేవనే కారణంతో 30 వేల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం.
-మండలంలోని ఓ గ్రామంలో ఓ ఇటుక బట్టీల వద్ద ఇటీవల ఓ వ్యక్తి చనిపోగా ఆ కేసులో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు .అంతేకాకుండా తన స్టేషన్లో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఇల్లు నిర్మాణానికి ఒక ట్రాక్టర్ ఇటుక నల్గొండకు పంపిచినట్టు సమాచారం..
-మండలంలో 11 రైస్ మిల్లులు ఉండగా ప్రతి మిల్లు మూడు నెలలకోసారీ ఒక కింటాల్ బియ్యం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకొని వసూలు చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం పట్టుకోకుండా ఉండేందుకు సదరు పోలీసులకు నెలవారీ మామూళ్లు ప్రత్యేకంగా ఇస్తున్నట్టు సమాచారం.
-మండలంలోని ఓ గ్రామంలో మానసిక స్థితి బాగోలేని ఓ బాలికపై జరిగిన లైంగికదాడికేసులో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో పెద్ద మనుషులు 1.80 లక్షకు రాజీ కుదర్చగా అందులో సదరు నిందితుడు లక్ష ఆ పెద్ద మనుషులకు చెల్లించాడు, మిగిలిన డబ్బులు చెల్లించడంలో కొంతకాల యాపన జరగడంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు కేసు నమోదు చేయించారు.ఆ కేసులో పెద్ద మనుషుల వద్దకు వెళ్లి భయపెట్టి వారి వద్ద 30 వేలు వసూలు చేసినట్టు ఆ గ్రామస్తులు చెప్పుకుంటున్నారు.
- గుట్కా వ్యాపారుల వద్ద నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూనే... పాన్‌షాప్‌లపై అడపా దడపా దాడులు చేస్తూ స్టేషన్‌కు తీసుకొచ్చి మామూళ్ల కోసం ఒత్తిడి చేసి మరి వసూళ్లు చేస్తున్నారని విమర్శలున్నాయి
ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు అవినీతి అక్రమాలు ఉన్నాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ స్టేషన్ లో జరిగే అవినీతి అక్రమాలను కట్టడి చేసి ఇ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.
నా దష్టికి రాలేదు....ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటా -డీఎస్పీ వెంకటేశ్వర్రావు
ఆ పోలీస్ స్టేషన్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు నా దష్టికి రాలేదు. డబ్బులు డిమాండ్ చేసినట్టు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి శాఖ పరమైన చర్యలు తీసుకుంటా. ఆ స్టేషన్లో ఎస్ఐ కొత్తగా వచ్చారు. సిబ్బంది కొత్తగా బదిలీ పై వచ్చారు.అవినీతి అక్రమాలు అనేవి ఏమి లేవు.