Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదళిత బంధు ఒక డ్రామా
అ కేంద్ర నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీలేదు.
అ అందరి సమిష్టి ఆలోచనతోనే ఎమ్మెల్యే టికెట్
అ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
రైతురుణ మాఫీ అంటూ ఊరిస్తూ కొంచెం కొంచెం రుణ మాఫీ చేయడం మూలంగా రైతు తీసుకున్న అప్పు బ్యాంక్ మిత్తికే సరిపోతుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు సోమవారం స్థానిక రహదారి బొమ్మలు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన జిల్లాకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని రాష్ట్రానికి కాదని ఆయన విమర్శించారు. ఒకటిన్నర లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టుకొని ఆయన జిల్లానే సస్యశ్యామలం చేసుకున్నారని విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్, ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి కాలువలు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ద్వారా నకరేకల్ నియోజకవర్గంలో లిఫ్ట్ ద్వారా నీరు అందించవచ్చని తెలిపారు. నేటికీ బస్వాపూర్ రిజర్వాయర్ పూర్తి చేయక ఇతర జిల్లాల పై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిదేండ్లు కావొస్తున్నా నేటి వరకు గ్రామీణ ప్రాంతాలలో ఒక్క ప్రభుత్వ ఇల్లు నిర్మించలేదని, ప్రకటించిన 57 ఏండ్ల పెన్షన్ ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. విద్యా ఉద్యోగాల కోసం ఏర్పడిన తెలంగాణలో నేటి వరకు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులుగా మార్చారన్నారు. డీఎస్సీ వేయకపోవడం వల్ల నిరుద్యోగులు రోడ్లపై తిరుగుతున్నారని, 70 వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నా భర్తీకి శ్రద్ధ చూపకపోవడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడతామని చెప్పి కేసీఅర్ మరోసారి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో పలు అభివద్ధి పనులు జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చింది ఏమీ లేదన్నారు. రైతుబంధుతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాలాన్ని దొర్లి ఇస్తున్నారన్నారు. దళిత బంధు పథకం ఒక డ్రామా అని విమర్శించారు. అందరి సమిష్టి ఆలోచనతోనే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని తెలిపారు. ఆయన వెంట స్థానిక నాయకులు దైదా రవీందర్, సురిగి రెడ్డి మల్లారెడ్డి, మేడి రవి చంద్ర, మందడి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ వేమావరం సుధీర్ బాబు, ఎండి జమీరో ద్దీన్, నల్ల వెంకట్ రెడ్డి, పున్న రమేశ్, ఆప్పం రామేశ్వరం, మీర్యా ల మల్లేశ్, కల్లూరి నరేష్, తదితరులు ఉన్నారు.