Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-దేవరకొండ
కార్మిక, కర్షక పక్షపాతి హన్మంత్ చంద్రన్న అని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలో మాజీ సర్పంచ్ హన్మంత్ చంద్రన్న 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోదండరామలయంలో ఏర్పాటు చేసిన సంస్కరణ సభలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొని మాట్లాడుతూ చంద్రన్న ఆశయ సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.దేవరకొండ పట్టణానికి చెందిన నిరుపేద విద్యార్థి ఉన్నత చదువుల కోసం కొట్టమ్మకు చంద్రన్నఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.20 వేలు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ అల్లంపల్లి నర్సింహ, ఎంపీపీ నల్లగాసు జాన్ యాదవ్, జెడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, వైస్ చైర్మెన్ రహత్ అలీ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, లోకసాని తిరపతయ్య, రాజినేని వెంకటేశ్వర్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ వడిత్య దేవేందర పాల్గొన్నారు.