Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ- నాగార్జునసాగర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని తన నివాసంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉండి పెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నారని, కేంద్ర సర్వీస్‌ల మార్పునకు సవరణలను తెస్తుందని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను అడ్డం పెట్టుకుని అధికారులను కేంద్రం బెదిరిస్తుందని ఆరోపించారు. రాజకీయ వివాదాల్లోకి వివిధ కమిషన్లను లాగొద్దని తెలిపారు. బీజేపీ అధ్యక్షులు బండి సంజరుకు కరోనా నిబంధనలు వర్తించవా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, జీఓ 317ను ప్రభుత్వం ఆలోచించే నిర్ణయం తీసుకుందని అన్నారు. జోనల్ విధానం అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాష్టప్రతి ఉత్తర్వుల మేరకే పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 690 రెసిడెన్షియల్ పాఠశాలలు నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రాథóమిక పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం బోధించడం బీజేపీకి ఇష్టం లేదు కాబట్టి అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ వైఖరి మారకుంటే భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, దేశంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాష్ట్ర ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్, ఐపీ ఎస్‌ల బదిలీల సవరణలో ఏకపక్ష నిర్ణయాన్ని విరమించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, నాగార్జునసాగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మెన్ బిన్నీ, పెద్దవూర జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సంఘం సాగర్ అధ్యక్షులు రమావత్ మోహన్ నాయక్ పాల్గొన్నారు.