Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చింతపల్లి
కరోనా కట్టడి కోసమే ఇంటింటి జ్వర సర్వే చేపడుతున్నట్టు దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు. సోమవారం ఫీవర్ సర్వే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చింతపల్లి మండలం మాల్ పట్టణంలో పర్యటించారు. ఫీవర్ సర్వే బందాల పనితీరును స్వయంగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వే కోసం వైద్య, ఆరోగ్య, పంచాయతీ, పురపాలక శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలున్న వారికి హోం ఐసోలేషన్ కిట్లు అందజేస్తారని అన్నారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ స్టాండింగ్ కమిటీ చెర్మెన్ కంకణాల ప్రవీణ వెంకట్ రెడ్డి, సర్పంచ్ శ్రీదేవిశ్రీనివాస్, కంకణాల వెంకట్ రెడ్డి, దొంతం చంద్రశేఖర్ రెడ్డి, ఉజ్జిని విద్య సాగర్ రావు, గున్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గొపిడి కృష్ణారెడ్డి, వింజమూరి రవి, పున్రెడ్డి సుమతి రెడ్డి, బాదేపల్లి పులిరాజు, అండేకార్ అశోక్, బొడ్డు గోపాల్ గౌడ్, సమ్మిడి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ సగర ఉ