Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
మండల అభివద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి కోరారు. సోమవారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. మండలంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకోవాలని కోరారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు చేసేందుకు నిధులు కేటాయిస్తామని, ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చెప్పాలని కోరారు.దాని పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. అనంతరం ఎంపీటీసీలు, సర్పంచ్లు, సిబ్బంది కలిసి ఎమ్మెల్సీ కోటిరెడ్డిని ఘనంగా సన్మానించారు. వైస్ ఎంపీపీ అమరావతి సైదులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీడీవో గార్లపాటి జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ గణేష్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వనిత, ఆయా శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.