Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నకిరేకల్ నియోజకవర్గంలో రూ.5.73 కోట్లతో బీటీ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. సోమవారం స్థానిక ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మండలంలో నార్కట్‌పల్లి నుంచి మాండ్ర వయా చౌటబాయి రోడ్డు మరమ్మతులకు రూ.82.50 లక్షలు, చిట్యాల మండలంలో గుండ్రాంపల్లి నుంచి పేరేపల్లి వయా ఏపూరు రోడ్డుకు రూ.119.00 లక్షలు, గుండ్రాంపల్లి నుంచి వెల్లంకి వయా సుంకెనపల్లి రోడ్డుకు రూ.143.00 లక్షలు, కేతేపల్లి మండలంలో చెరుకుపల్లి నుంచి భీమారం వయా తుంగతుర్తి రోడ్డుకు రూ.68.50 లక్షలు, జాతీయ రహదారి 65 నుంచి కాసనగోడు రోడ్డుకు రూ.117.00 లక్షలు, నకిరేకల్ మండలంలో నోముల నుంచి గుడివాడ రోడ్డుకు రూ.32.00 లక్షలు, సుంకెనపల్లి నుంచి జైకేసారం రోడ్డుకు రూ.11.00 లక్షలు మంజూరు అయినట్లు తెలిపారు. నిధులు మంజూరు చేసిన కేసీఆర్‌కు, సహకరించిన మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీష్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.