Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ మండల పరిషత్ ఆవరణలోని ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేత నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని కోరుతూ భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు సోమవారం కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి దైద రవీందర్, ఇంటిపార్టీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు చెరుకు లక్ష్మి, న్యూ డెమోక్రసీి జిల్లా కార్యదర్శి రాయి కృష్ణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి గాజుల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, గార్లపాటి రవీందర్ రెడ్డి, ఎంపీటీసీలు సామ మల్లమ్మ, ఇమ్మడిపాక లక్ష్మీ వెంకన్న, నాయకులు సామ రవీందర్ రెడ్డి, గాదగోని కొండయ్య, వీరార్జున్ రెడ్డి, బహుజన కమ్యూనిస్టు పార్టీ రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి బొమ్మకంటి కోమరయ్య , వంటేపాక సతీష్, పందిరి సతీష్ ఉన్నారు.