Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
కరోనా తీవ్రత పెరుగుతున్న దష్ట్యా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మెన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుధ్య, నీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ సిబ్బంది, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. బూస్టర్ టీకాలు, అవసరమైన వారికి మూడు రకాల మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, వైస్ చైర్మెన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్లు గోపగోని లక్ష్మణ్, పోలోజు శ్రీధర్‌బాబు, కామిశెట్టి శైలజ పాల్గొన్నారు.