Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
రాజీవ్ స్మారక ఫౌండేషన్ ట్రస్టు చైర్మెన్ డాక్టర్ రావుల మాధవరెడ్డి సహకారంతో సోమవారం మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. తాళ్లసింగారం గ్రామానికి చెందిన జంపాల కష్ణకు పదివేలు,నేలపట్ల గ్రామానికి చెందిన బూడిద బుచ్చయ్య కుటుంబానికి పదివేలు, కుంట్లగూడెం గ్రామానికి చెందిన గంగదేవి సుజాత కుటుంబానికి పదివేల చొప్పున ట్రస్టు కార్యదర్శి ఎండి.ఖయ్యుమ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుర్వి నర్సింహాగౌడ్, చౌట వేణుగోపాల్, కొడెం రాములు, పాలమాకుల యాదయ్య, దొనకొండ కష్ణ, చిన్నం బీరయ్య పాల్గొన్నారు.