Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆహ్వానించిన
దర్గా ముజావర్లు
అ కరోనా నేపథ్యంలో ఆంక్షల మధ్య
ఉర్సు ఉత్సవాలు
అ భక్తులు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి
అ మూడు రోజులపాటు కంట్రోల్ రూంను ఏర్పాటు
మాస్క్ ఉంటేనే.. జానపాడు సైదన్న దర్శనం
అ ఈసారి శుభ్రతకు అధిక ప్రాధాన్యం
నవతెలంగాణ-పాలకవీడు
పాలకీడు మండలం జాన్పహాడ్ దర్గ్ణాలో ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉర్సుఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండే గాక.. ఇతర రాష్ట్రాల నుంచి లక్షకుపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో.. వక్ఫ్ బోర్డు, దర్గా యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు . సౌకర్యాలు కల్పించడానికి యంత్రాంగం అప్రమత్తమైంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కోదాడ మిర్యాలగూడ డిపో నుండి బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజంభిస్తున్న తరుణంలో రెండంచెల విధానంలో.. మాస్క్ ఉంటేనే భక్తులకు దర్శనం ఉంటుందని, దర్గా యంత్రాంగం స్పష్టంచేసింది. దాదాపు 300మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ట్రాఫిక్ ఆంక్షలకు అనుగుణంగా భక్తులు సహకరించాలని.. కోదాడ డీఎస్పీ రఘు, సీఐ రామలింగారెడ, స్థానిక ఎస్ఐ సైదులు గౌడ్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుండి.. 70 మంది పారిశుధ్య కార్మికులను ఈ ఉరుసు కార్యక్రమంలో సేవలు అందిస్తారని, శుభ్రతకు భక్తులు సహకరించాలని ఎంపీడీవో జానయ్య తెలిపారు. తమ సిబ్బంది మూడు రోజులు అందుబాటులో ఉంటూ.. 24 గంటల పాటు విద్యుత్ అంతరాయం లేకుండా పార్కింగ్ ప్రదేశం లో సైతం లైటింగ్ ఏర్పాటు చేస్తామని విద్యుత్ ఏఈ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం లో కొలువై ఉన్న జాన్ పాడు ఉర్సుకు మూడు మార్గాల నుండి భక్తులు.. వచ్చే వీలు ఉండడంతో.. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, స్థానిక డెక్కన్ , పెన్నా సి మెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు.. ముందుగానే వారి లారీలను నిలుపుదల చేయాలని సమాచారం అందించారు. మండల వైద్యాధికారులు సిబ్బంది మూడు రోజులపాటు మెడికల్ క్యాంపులను నిర్వహిస్తామని, భక్తులు శానిటైజర్ చేసుకొని దర్శనానికి రావాలని కోరారు. దర్గా కూతవేటు దూరంలో ఉన్న కష్ణానదిలో, స్నానాలు చేయడానికి భక్తులు తండోపతండాలుగా వెళ్లే అవకాశం ఉన్నందున, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, అక్కడ ప్రమాద హెచ్చరిక బోర్డులు పెడుతున్నట్టు తెలిపారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, ప్యాకెట్లు బాటిళ్లలో అందజేస్తున్నట్టు తెలిపారు. వసతులు ఏర్పాటు కోసం వర్క్స్ బోర్డు నుండి ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు ఆ బోర్డు ఇన్స్పెక్టర్ తెలిపారు. వీటితో పాటు స్థానిక ఫ్యాక్టరీ యాజమాన్యాలు తాగునీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసి దర్గా ఉర్సు కార్యక్రమానికి ఆహ్వానించారు. సుమారు 400 ఏండ్లఘన చరిత్ర కలిగిన జాన్పహాడ్ దర్గాఉర్సులో పవిత్ర గంధాన్ని అందుకోవడానికి భక్తులు పోటీ పడతారు.