Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
భౌతిక దూరం పాటిస్తూ మాస్కు ధరించి తగిన జాగ్రత్తలు పాటించినట్టయితే కరోనాను జయించవచ్చని మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో వైద్య సిబ్బంది సన్నాయిల సైదులుకు కరోనా రావడంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు.ఈ మేరకు కరోనా బాధితులకు ప్రతి ఒక్కరు అండగా ఉండి ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో హెచ్ ఈ ఓ సముద్రాల సూరి, హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమన్న, యాదగిరి, చారి ,ఆకారపు భాస్కర్, తునికి నాగరాజు పాల్గొన్నారు.